బాలయ్య, పవన్ కాంబోలో మిస్ అయ్యిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
కానీ.. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ట్రెండ్ మొదలుకాన్ని సమయంలో పవన్ కళ్యాణ్ బాలయ్యతో కలిపి ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలని డైరెక్టర్ భావించారట. వీళ్ళిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే.. డైరెక్ట్‌ర్ రాసుకున్న కథకు వీళ్ళిద్దరి క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ డైరెక్టర్ సినిమా కథను ఇద్దరు స్టార్ హీరోలకు వినిపించారట. అయితే ఈ సినిమాను బాలయ్య రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. ఇంతకీ డైరెక్టర్ ఎవరు మూవీ ఏంటో చెప్పలేదుకదా.. అదే డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్థసాన్ని తెరకెక్కించిన " గోపాల గోపాల ".
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబోలో మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో మొదట వెంకటేష్ పాత్ర కోసం బాలకృష్ణని అనుకున్నారట. బాలయ్య ఈ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా ఉంటాడని భావించారట. అయితే బాలయ్య మాత్రం కథ నచ్చినప్పటికీ ఈ సినిమాలో క్యారెక్టర్ వే ఆఫ్ లాంగ్వేజ్ కి, తన బాడికి అసలు సెట్ కాదని సినిమాలో నటించిడం కుదరదని చెప్పేసాడట. అంతే కాదు దేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నప్పుడు.. ఇలాంటి పాత్రలో నేను నటిస్తే అభిమానులు హర్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ ఊహించిన బాలయ్య.. ఈ సినిమాకు నో చెప్పేసాడట. తర్వాత ఈ సినిమాకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించాడు. ఇక ఈ సినిమాలో పవన్, వెంకటేష్ ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకుంది.