ఓవర్సీస్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్.. తొలిరోజు కలెక్షన్ల లెక్కలు ఇవే!

frame ఓవర్సీస్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్.. తొలిరోజు కలెక్షన్ల లెక్కలు ఇవే!

Reddy P Rajasekhar
సాధారణంగా ఓవర్సీస్ లో స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్లు వచ్చిన స్థాయిలో సీనియర్ హీరోల సినిమాలకు కలెక్షన్లు రావనే సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. ఓవర్సీస్ లో తొలిరోజే ఈ సినిమాకు 5 లక్షల డాలర్ల కలెక్షన్లు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
స్టార్ హీరో వెంకటేశ్ సినీ కెరీర్ లో ఈ స్థాయి కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి అని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు కావడం, సినిమాలోని పాటలన్నీ హిట్ కావడం కూడా ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో సంక్రాంతికి వస్తున్నాం సాధించిన కలెక్షన్ల రికార్డులు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
 
విక్టరీ వెంకటేశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం ఇదే తరహా మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వెంకటేశ్ రెమ్యునరేషన్ 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విక్టరీ వెంకటేశ్ తర్వాత సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది.
 
విక్టరీ వెంకటేశ్ వయస్సు 64 సంవత్సరాలు అయినా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆయన ఫిట్ గా కనిపించడం గమనార్హం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఒక హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటించారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్దులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వీక్ డేస్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: