పుష్ప2 కలెక్షన్స్ ను దాటలేకపోయిన గేమ్ చేంజర్..ఎంత తక్కువంటే?
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా 6600కి పైగా థియేటర్లలో విడుదల అయ్యింది. కాగా.. రూ. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అయితే, గేమ్ ఛేంజర్ సినిమాకు ఇండియాలో రూ.40 కోట్ల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం.
అలాగే తమిళం నుంచి రూ. 54 లక్షలు, హిందీ బుకింగ్స్ రూ. 2.14 కోట్లు, తెలుగులో రూ. 16 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో పది కోట్లుకుపైగా గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్స్ తెలిపాయి. ఇలా మొత్తంగా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గేమ్ ఛేంజరు రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని అంచనాలలో తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమా డే 1 నాడు వరల్డ్ వైడ్ రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ లో గేమ్ ఛేంజర్ సగం కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.