ఫ్యాన్స్.. యాంటీ ఫ్యాన్స్ కాదు.. అసలు నచ్చాల్సింది వాళ్లకి..!
కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే జనాలు తమకు నచ్చిన సినిమాను ఎవరు బాగుంది అన్నా ఎవరు బాగాలేదని చెప్పినా చూస్తారు. అసలు సినిమా నచ్చాల్సింది ఫ్యాన్స్ కు.. యాంటీ ఫ్యాన్స్ కి కాదు కామన్ ఆడియన్స్ కి.. అలా ట్రోల్స్ కాబడ్డ సినిమాలు కామన్ ఆడియన్స్ కి నచ్చి సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఐతే ఈ ట్రోల్స్, నెగిటివిటీ కామన్ ఆడియన్స్ లో కూడా సినిమా మీద ఒక ఇంపాక్ట్ ఏర్పరచే ప్రయత్నం చేసినా నిజమైన సినిమా అభిమాని ఇలాంటివి నమ్మకుండానే సినిమా చూసి తన అనుభూతిని పొందుతాడు.
స్టార్ సినిమాలో ఫ్యాన్స్ ఎవరికి వారు వాళ్ల వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు. అందుకే రివ్యూస్ అంటూ వాళ్లు చేస్తున్న అతి చూసి భరించడం కన్నా ట్రైలర్ చూసి సినిమా చూడొచ్చు అనే భావన కలిగింది అంటే ఎంచక్కా టికెట్ కొనుక్కుని సినిమా చూసేయడమే తప్ప ఈ రివ్యూస్, ఈ ట్రోల్స్ చూసి సినిమా మీద ఒపీనియన్ కి వస్తే మోస పోయినట్టే అవుతుంది. ఇది ఇప్పుడు రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమాకే కాదు రాబోతున్న ఏ స్టార్ సినిమాకైనా ఇదే ఫాలో అవ్వాలి. ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు.. ఏం చెబుతున్నారు అన్నది కాదు కామన్ ఆడియన్స్ కి సినిమా నచ్చిందా లేదా అన్నది ఇక్కడ అసలు లెక్క అని చెప్పొచ్చు.