మెగా ఫ్యాన్స్ పవర్ చూపించే టైం ఇది..!

shami
స్టార్ సినిమాకు యునానిమస్ హిట్ టాక్ వస్తే దాని మీద ఎవరెంత ట్రోల్ చేసినా సరే ఆ సినిమా రాబట్టాల్సిన క్రెడిట్స్.. చేయాల్సిన కలెక్షన్స్ తెస్తుంది. కానీ స్టార్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తేనే ఆ సినిమాను లేపడమా తొక్కడమా అన్నది ఫ్యాన్స్ ఇంకా యాంటీ ఫ్యాన్స్ చేతుల్లో ఉంటుంది. ఏంటి ఇలా కూడా ఉంటుందా అంటే సోషల్ మీడియా యుగంలో ఇలానే ఉంటుందని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది.
స్టార్ సినిమా అంటే చాలు టాక్ ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా కూడా వెంటనే యాంటీ ఫ్యాన్స్ అంతా అసెంబుల్ అయ్యి సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్స్ చేస్తూ సినిమాకు బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా అసలు టాక్ ఏంటన్నది సినిమా చూసిన వాళ్లకే తెలుస్తుంది. కానీ బాగున్న వాటిని కూడా బాగాలేదంటూ కొందరు చేసే అతి ప్రచారం సినిమాను దెబ్బ కొడుతుంది.
ప్రస్తుతం రాం చరణ్ గేం ఛేంజర్ సినిమాకు అలాంటి ఎఫెక్ట్ పడుతుంది. ఓ పక్క మెగా ఫ్యాన్స్ సినిమా చూసి సూపర్ అనేస్తుంటే యాంటీ ఫ్యాన్స్ వాళ్లు వీళ్లు అని కాదు అందరు కలిసి గేం ఛేంజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకప్పుడు మెగా హీరోల సినిమాలు ముఖ్యంగా రాం చరణ్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అదిరిపోయేవి. అంతేకాదు అలాంటి సినిమాలను కూడా హిట్ చేసిన ఘనత మెగా ఫ్యాన్స్ కు ఉంది. మరి అలాంటిది ఈసారి ఎందుకో ఫ్యాన్స్ లో కూడా కొద్దిపాటి నిరుత్సాహం కనబడుతుంది. మెగా ఫ్యాన్స్ లో పవర్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. మరి అబ్బాయ్ సినిమాకు మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త సపోర్ట్ అందిస్తే ఆ ట్రోల్స్ సంగతి పక్కన పెడితే సినిమాకు ఇప్పుడున్న టాక్ కు మరీ వరస్ట్ గా పోకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: