"గేమ్ చేంజర్" సినిమా హిట్ అవ్వడానికి కర్త-కర్మ-క్రియ అంతా ఆయనే..ఆ రుణం తీర్చుకోలేనిది..!

Thota Jaya Madhuri
హమ్మయ్య .. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ చేంజర్" సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది . ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి నుంచి తెలంగాణలో తెల్లవారుజామున షోలు ప్రారంభమయ్యాయి. "గేమ్ ఛేంజర్" సినిమా రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్నో ఆశలతో భారీ అంచనాలతో శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.  అయితే సినిమా రిలీజ్ కి ముందు మాత్రం చాలా చాలా నెగిటివిటీని ఫేస్ చేసింది .


"గేమ్ చేంజర్".. కచ్చితంగా ఈ సినిమా ప్లాప్ అవుతుంది అంటూ కొందరు ధీమా వ్యక్తం చేశారు . అయితే మెగా ఫాన్స్ మాత్రం ఎప్పుడు కూడా అలాంటి నెగటివ్ వైబ్స్ పెట్టుకొనే పెట్టుకోలేదు . కాగా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన "గేమ్ చేంజర్" సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ చాలా కాలం తర్వాత మళ్లి హిట్ అందుకున్నాడు అంటుంది కోలీవుడ్ మీడియా. అంతేకాదు తెలుగు మీడియా సైతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ను ఓ రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు .


నిజంగానే శంకర్ మళ్లీ ఫామ్ లోకి రావడానికి ఈ సినిమా బాగా సహాయపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాకి కర్త - కర్మ - క్రియ అంతా కూడా రామ్ చరణ్ అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.  సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా తన పర్ఫామెన్స్ తగ్గకుండా చాలా చాలా కష్టపడి నటించాడు చరణ్.  సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెరపై రామ్ చరణ్ ని అస్సలు చూడనే చూడలేరు. అచ్చం చిరంజీవిలాగే నటించారు . ఈ కామెంట్స్ ప్రతి మెగా ఫ్యాన్ కూడా చేస్తూనే వస్తున్నారు. మరి ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే స్టోరీలో రామ్ చరణ్ పెర్ఫామెన్స్.. చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది.  రాంచరణ్ నటించలేదు.. జీవించాడని అంటున్నారు . అలా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం అయ్యింది రాంచరణ్ నటన . చూద్దాం మరి ఫస్ట్ డే ఏ విధమైన కలెక్షన్స్ సాధిస్తుందో ఈ మూవీ..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: