గేమ్ చేంజర్ రిజల్ట్ పై.. సినిమా చూసాక దిల్ రాజు ఏమన్నాడంటే?
అసలు విషయంలోకి వెళితే... దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూవీని అభిమానులతో పాటుగా చూడడం జరిగింది. దిల్ రాజుతో పాటుగా ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాని తిలకించినట్టు తెలుస్తోంది. వీరంతా భ్రమరాంబలో సినిమాను చూసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన దిల్ రాజు తన రివ్యూని చెప్పాడు. ఈ మూవీని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని, ముఖ్యంగా రామ్ చరణ్, ఎస్ జే సూర్య సీన్లను బాగా ప్రశంసిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపాడు.
ఇక ఇదే విషయమై దిల్ రాజుకి సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్ గురించి అడగడంతో అది ఏ హీరోకైనా కామన్ గా జరిగేదేనని, దాని గురించి పెద్దగా అలోచించి టైం వెస్ట్ చేసుకోము అని చెప్పుకొచ్చాడు. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి, జనాలు గేమ్ చెంజర్ ని ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు. కాగా సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాతో దిల్ రాజు ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఇక లాంగ్ రన్‌లో ఈ మూవీతో దిల్ రాజు ఎంత లాభం, ఎంత నష్టం వస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.