ఇదెక్కడి అభిమానం సామీ.. రామ్ చరణ్ కోసం చేయి కోసుకున్న అభిమాని?

praveen
అభిమానం వెర్రితలలు వేయడం అంటే ఇదే. ఓ మనిషిపై అభిమానం ఉండొచ్చు.. కానీ ఇలా మితిమీరి ఉండకూడదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. విషయంలోకి వెళితే... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూవీ "గేమ్ ఛేంజర్" నేడు రిలీజ్ థియేటర్లలో సందడి చేస్తోంది. మెగా పవర్ స్టార్ సినిమా కావడంతో మెగాభిమానుల హడావుడి మాములుగా లేదు. నిన్న అర్ధరాత్రినుండి షోస్ వేయడంతో అభిమానులు థియేటర్స్ వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల హీరో రామ్ చరణ్ కటౌట్స్ కి పాలాభిషేకాలు చేయగా, మరికొన్ని చోట్ల వందలకొలది కొబ్బరి కాయలు కొట్టారు.
అయితే, అనంతపురంలో ఓ వీరాభిమాని తీరుకి అంతా షాక్ అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. "గేమ్ ఛేంజర్" విడుదల సందర్భంగా ఓ అభిమాని తన చేయిని బ్లేడుతో కట్ చేసుకుని మరీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్లెక్సీకి రక్త తిలకం దిద్దుతూ "జై చరణ్... జై చరణ్" అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడున్న వారు, వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు అతగాడి తీరుపై మండిపడుతున్నారు.
అభిమానం ఉండాలి.. కానీ ఇలా కాదు? మెగా హీరోలకు ఇలాంటి పనులు అసలు నచ్చవంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ, అతగాడి చర్యపైన మండిపడుతున్నారు. ఇక తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన గేమ్ చెంజర్ సినిమా నేడే విడుదల అయ్యింది. ఈ మూవీలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి వంటి నటీ మంచి మంచి నటులు నటించడంతో ఈ సినిమాపైన అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి చాలామంది రైటర్స్ పనిచేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: