బాలయ్య డాకు మహారాజ్ కు లేనిపోని టెన్షన్ .. బాబి ఏం ప్లాన్ చేసావ్ గురు..?

Amruth kumar
ఇక సంక్రాంతి సినిమాల రిలీజ్ కు టైం దగ్గర పడుతుంది .. పండక్కు కేవలం మరో ఐదు రోజులు సమయం కూడా లేదు .. ఈ క్రమంలో సంక్రాంతి సినిమాలకు సంబంధించిన హీరోలు , దర్శకులు , చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ప్రమోషన్ తో పాటు సినిమాకు సంబంధించిన వర్క్ లో తల మొలకలు అవుతున్నారు.  అయితే  తెలుగులో వచ్చే ప్రతి సినిమా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుంది .. మనకు రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు అక్కడ రిలీజ్ అవుతుంది .. ఇదే క్రమంలో ఇప్పుడు సంక్రాంతి సినిమాలకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి .. ఈ క్రమంలో ఈరోజు కనక ఓవర్సీస్ కంటెంట్ వెళ్ళకపోతే అక్కడ ప్రీమియర్లు పడటం కష్టం ..

ఈ రాత్రికి ఎలాగైనా కంటెంట్ పంపేయాలని నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కింద మీద పడుతున్నారు .. ఈ రాత్రికి కంటెంట్ అయితే వెళ్ళిపోతుంది అందువల్ల గేమ్ చేంజర్ ఎలాంటి భయం లేదు .కానీ గేమ్ చేంజర్  వర్క్ చేసిన తమన్‌నే డాకు మహారాజుకు పని చేయాలి .. ఇప్పుడు ఈ ఒక్క రాత్రి దాటిన దగ్గర నుంచి తమన్ డాకు మహారాజ్ దగ్గరకు వచ్చేస్తాడు. ఇక డాకు మహారాజ్ కి సంబంధించి ఇంకా రెండు రీళ్ళకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి .. ఆపైన మిక్సింగ్ ఇవ్వాలి అప్లోడ్ అయిన తర్వాత కాపీ చెక్ చేసుకోవాలి అప్పుడు ఓవర్సీస్ కు కాపీ పంపాలి ఇవన్నీ 9వ తేదీ లోగా జరగాలి ..

 ప్రస్తుతం తమన్ రాత్రి పగలు అని తేడా లేకుండా వర్క్ చేస్తున్నారు .. అలాగే దర్శకుడు బాబి కూడా తమన్ తో కలిసి ల్యాబ్ లోనే గడుపుతున్నాడు. ఇంత రాత్రి పగలు వర్క్ చేసిన క్వాలిటీ దెబ్బ తినకూడదు .. ప్రధానంగా ఎమోషనల్ సీన్స్ పండాలి అంటే నేప‌థ్య‌ సంగీతం అనేది ఎంతో కీలకము .. బాలయ్య సినిమాకు తమన్ నుంచి మంచి అవుట్ పుట్ వస్తుందని పేరు ఉంది ఆ పేరు నిలబెట్టుకోవాలి ఇవన్నీ జరగడానికి ఉన్న సమయం 48 గంటలు మాత్రమే .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: