అపరిచితుడు: సైకలాజీకల్ థ్రిల్లర్ జానర్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పాన్ఇండియా డైరెక్టర్.!

FARMANULLA SHAIK
డైరెక్టర్ శంకర్ మణిరరత్నం తర్వాత తెలుగు వాళ్లకు తమిళ సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు. తమిళ సినిమాని కమర్షియల్ గా పైకి లేపిన డైరెక్టర్. ఎంతోమంది 80s, 90s కిడ్స్ కి స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు.టెక్నాలజీ, సామాజిక అంశాలపై తనదైన స్టైల్లో చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దిట్ట. తమిళ సినీ పరిశ్రమకు చెందిన శంకర్ రూపొందించిన సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. దక్షిణాది సినీ పరిశ్రమకు పాన్ ఇండియాకు పరిచయడం చేసింది కూడా శంకర్ అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ఇప్పటివరకు శంకర్ నేరుగా ఒక్కసినిమాక కూడా చేయలేదు. కానీ తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.1993లో జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలా ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి.

ఇవన్నీ కమర్షియల్ గా భారీ సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ తమిళ్ సినిమాలే అయినా తెలుగులో కూడా రిలీజయి, ఇక్కడ కూడా పెద్ద హిట్ అయి తమిళ్ హీరోలని, శంకర్ ని, ఏఆర్ రహమాన్ ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసాయి. రజినీ కాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ వంటి చిత్రాలను తెరకెక్కించిన శంకర్ ఇప్పటికీ తన హావా కొనసాగిస్తున్నాడు.ఈ సందర్భంగా తను తెరకెక్కించిన సినిమాలలో నేషనల్ అవార్డ్ అందుకున్న సినిమాలలో అపరిచితుడు ఒకటి.టాలెంటెడ్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన అన్నీయన్ సినిమా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ చిత్రసీమలో సామాజిక ఉదాసీనత ఆధారంగా రూపొందించారు. ఫ్యాషన్ మోడల్, సీరియల్ కిల్లర్‏గా మారిన అహంభావాలను అభివృద్ధి చేసే చట్టాన్ని పాటించే వినియోగదారుల రక్షణ లాయర్ రామానుజం అయ్యంగార్ చుట్టూ తిరుగుతుంది.

ప్రపంచాన్ని మార్చేందుకు రామానుజం హత్య మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఈ సినిమాలో చూపించారు.సైకలాజికల్ థ్రిల్లర్ విక్రమ్  కెరీర్‏లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇదిలావుండగా తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శంకర్ మరోసారి చర్చగా మారారు. ఇప్పుడు శంకర్ కి ఏమైంది? శంకర్ సినిమాలు మిస్ ఫైర్ ఎందుకవుతున్నాయి అని అందరి మదిలో ఒకటే ఆలోచన.ఈ క్రమంలో భారతీయుడు 2 సినిమా రిజల్ట్ తో అందరి చూపు రామ్ చరణ్ ,శంకర్ కాంబోలో రాబోతున్న గేమ్ చెంజర్ సినిమాపైనే పడింది. రెండు సినిమాల మీద పనిచేస్తూ గేమ్ చెంజర్ ని కూడా ఇలా చెయ్యడు కదా అసలే చరణ్ rrr తర్వాత వచ్చే పాన్ ఇండియా సినిమా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాటలు, ఫైట్లు, కథ, కథనం.. ఇలా అన్నిటితో మెప్పించే సినిమాలు తీసిన శంకర్ గేమ్ ఛేంజర్ తో అయినా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: