బీజేపీ ఆఫీసుపై దాడి.. కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందా?

Chakravarthi Kalyan
బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అంశం తెలంగాణలో చర్చనీయాంశం అయ్యింది. ప్రియాంక బుగ్గల్లా ఢిల్లీ రోడ్లు వేస్తామన్న బీజేపీ ఢిల్లీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. షాకింగ్ ఏంటంటే.. ఈ దాడిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తప్పుబట్టారు. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిపై టీపీసీసీ సీరియస్ అయ్యింది.

ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన ఉండాలని.. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే అయినప్పటికీ.. యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

యూత్ నేతలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. యూత్ నేతలను పిలిచి మందలించారు. బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

ప్రజాస్వామ్యంలో దాడులు చెయ్యడం పద్ధతి కాదన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా బీజేపీ నాయకులు సహకరించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: