ఆ ఏరియాలో దేవరను బీట్ చేసిన గేమ్ ఛేంజర్.. పెద్ద టార్గెట్ ఫిక్స్ అయింది..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన సీడెడ్ ఏరియా బిజినెస్ దేవర సినిమా బిజినెస్ ను దాటి వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సీడెడ్ ఏరియాలో దేవర మూవీ కి 22 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , గేమ్ చేంజర్ మూవీ కి సీడెడ్ ఏరియాలో 23 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. అలా దేవర సినిమా కంటే గేమ్ చేంజర్ మూవీ సీడెడ్ ఏరియాలో ఒక కోటి ఎక్కువ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో జరుపుకొని గేమ్ చేంజర్ మూవీ దేవర మూవీ ని బీట్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే సీడెడ్ ఏరియాలో పుష్ప పార్ట్ 2 మూవీ కి అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ఈ ఒక్క ఏరియాలోనే 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ మూవీ తర్వాత స్థానంలో కల్కి 2898 AD సినిమా 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రెండవ స్థానంలో ఉండగా , గేమ్ చేంజర్ మూవీ 23 కోట్ల ప్రీ బిజినెస్ తో మూడవ స్థానంలో ఉంది. ఇక దేవర సినిమా 22 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను సీడెడ్ ఏరియాలో జరుపుకొని నాలుగవ స్థానంలో ఉంది. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ కి సీడెడ్ ఏరియాలో భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ మూవీ ఈ ఏరియాలో ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుంది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: