తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను , కొన్ని పాటలను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో యూట్యూబ్ లో 7.98 మిలియన్ వ్యూస్ , 195.5 కే లైక్స్ దక్కాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ మూవీ అదిరిపోయే రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం అవుతుంది.
ఈ మధ్య కాలంలో బాలయ్య నటించిన చాలా సినిమాలు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలుగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడంతో ఈ మూవీ కూడా అదే రేంజ్ విజయాన్ని అందుకుంటుంది అని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.