మరో మూడు రోజుల్లో "గేమ్ చేంజర్" రిలీజ్ అవుతున్న..చరణ్ ధ్యాస మొత్తం దాని మీదే.. ఏం కర్మ రా ఇది..!

Thota Jaya Madhuri

ఒకప్పుడు స్టార్స్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కేవలం సినిమాపై మాత్రమే ఆలోచించే వాళ్ళు.  సినిమా జనాలకి నచ్చుతుందా? సినిమా సూపర్ సూపర్ హిట్ అవుతుందా ..? సినిమా ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు తెచ్చి పెడుతుందా..?? తనకి కెరియర్ లో మరొక స్టెప్ చేయడానికి ఈ సినిమా తోడ్పడుతుందా..? ఇలా ఆలోచించే వాళ్ళు.. కానీ ఇప్పుడు సీన్  మొత్తం మారిపోయింది . సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట చూసిన తర్వాత ప్రతి ఒక్క స్టార్ హీరోకి గుండెల్లో గుబులు మొదలైంది.
తమ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తారో..? ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీకి తెలుసు.  అలాంటి సెలబ్రిటీస్ మొత్తం ఇప్పుడుభయపడిపోతున్నారు . ఎవరైతే సినిమాలో నటించి ఆ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుందో..? వాళ్లందరికీ ఇప్పుడు ఒకటే సమస్య . ఫ్యాన్స్ చేసే హంగామాకి ఎక్కడ మనం బలవ్వాలి అని..  రామ్ చరణ్ కూడా అదే కారణంగా భయపడిపోతున్నాడట . సినిమా రిలీజ్ మరికొద్ది గంటల్లోనే అయినా సరే రాంచరణ్ మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారట .
సినిమా హిట్ నా..? ఫట్ నా..? ఆ విషయం పక్కనపెడితే సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గా.. ఇంటికి తిరిగి వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట . ముందుగానే థియేటర్ యాజమాన్యంతో సరైన సెక్యూరిటీ కల్పించాలి అని ..థియేటర్ ఆక్యూపెన్సీ బట్టేఅ జనాలు అక్కడ ఉండేలా చూసుకోవాలి అని.. స్పెషల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. దీంతో రామ్ చరణ్ కి సంధ్యా థియేటర్ ఘటన "గేమ్ చేంజర్" సినిమాని ఎంజాయ్ చేయనీకుండా చేస్తుంది అంటున్నారు జనాలు. మరికొందరు రామ్ చరణ్ ని పొగిడేస్తున్నారు. అందుకే నువ్వు గ్లోబల్ హీరో అయ్యావ్ అన్నా..అంటున్నారు. కచితంగా "గేమ్ చేంజర్" సినిమా హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: