15 ఏళ్లకే కమిట్ మెంట్ అడిగారు..టాలీవుడ్ హీరోయిన్ సంచలనం ?
అలనాటి టాలీవుడ్ నటి దివ్యవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. 90లలో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలలో నటించింది. ఆమె కెరీర్ లో మైల్డ్ స్టోన్ గా నిలిచిన సినిమా "పెళ్లి పుస్తకం" అని చెప్పవచ్చు. ఈ సినిమాతో దివ్యవాణికి ఎనలేని గుర్తింపు దక్కింది. అలాగే 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం', 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' వంటి సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత దివ్యవాణి ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ తన నటనకు పెద్దగా గుర్తింపు రాలేదు.
ఏవో కొన్ని సినిమాలలో నటించి కాలాన్ని గడిపింది. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా దివ్య వాణి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా మాట్లాడుతూ.... ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఇతర యాక్టర్లు కూడా ఇలాంటి సమస్యలను చాలానే ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఈ సమయంలో దివ్యవాణి తన అనుభవాన్ని వెల్లడిస్తూ నాకు 15 ఏళ్ల వయసులో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నన్ను హీరోయిన్ గా ఓకే చేశారు. మొదట ఈ అమ్మాయి బొమ్మలాగా అందంగా ఉంది అంటూ పొగిడారు. కానీ వారు అనుకున్న విధంగా నేను లేకపోయేసరికి ఆ క్యారెక్టర్ నుండి నన్ను తీసేశారు అంటూ దివ్యవాణి తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది.
తాను తన పదో తరగతి పూర్తికాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చూసిన ప్రతి మూవీ మేకర్ తనని చాలా అందంగా ఉన్నావ్ అంటూ పొగడ్తలతో ముంచేసేవారని చెప్పింది. కానీ వారి కమిట్మెంట్స్ కు నేను ఒప్పుకోకపోవడంతో సినిమాలలో హీరోయిన్గా నన్ను నాకు చాన్సులు ఇవ్వలేదంటూ దివ్యవాణి వెల్లడించింది. ప్రస్తుతం దివ్యవాణి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.