కమర్షియల్ కథతో కరెక్ట్ మెసేజ్ ఇచ్చిన జనతా గ్యారేజ్..!!

murali krishna
భారతదేశ ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి..ఏ పండుగకు లేని సందడి అంతా దీపావళి పండుగ నాడే ఉంటుంది.. దీపావళి పండుగ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ వుండరు..చిన్న పిల్లలు నుంచి పెద్ద వారి వరకు ఈ పండగ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు..ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పండుగకు నెల రోజుల ముందు నుండే వీధిలో టపాసులు కాలుస్తూ ఎంతో హడావుడి చేస్తూ వుంటారు... అయితే చిన్న పిల్లల భావనలో దీపావళి అంటే కేవలం టపాసులు కాల్చడం.. కానీ దీపావళికి అర్ధం వేరే వుంది..దీపావళి అంటే దీపాల పండుగ.. దీని అర్ధం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అప్పట్లో దీపాలని వెలిగించే వారు.. క్రమంగా ఆ పండుగ దీపావళిగా మారింది.. అయితే దీపావళి పండుగను తరాలు మారే కొద్ది దీపాల పండుగ గా కంటే టపాసుల పండుగగా ఎక్కువ మంది జరుపుకుంటున్నారు.ఎడతెరపలేకుండా, నిర్వీరామంగా టపాసులు  కాలుస్తూ ప్రకృతిని బాగా పొల్యూట్ చేస్తున్నారు..

 దీపావళి వచ్చిందంటే చాలు మూగ జీవాలకు ఆ రోజు నరకమే.. అవి బిక్కు బిక్కుమంటూ ఆ శబ్దాలు వినపడకుండా దాక్కుంటూ బతుకుతాయి..ఆ భయంకరమైన చప్పుల్లు విని ప్రళయం వస్తుందేమో అని అవి భయపడుతూ ఉంటాయి.... దీనికి అసలైన పరిస్కారం.. ప్రజలలో అవగాహన తేవడమే అసలైన దీపావళి అంటే అర్ధం చెప్పాలి.. దీపావళి పండుగ అంటే మూగ జీవాలు జడుసుకునేలా చేయకూడదు..అయితే దీపావళి పండుగ అంటే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సినిమా ఇండస్ట్రీ తన వంతు పాత్ర పోషిస్తుంది.సినిమా ద్వారా ప్రేక్షకులు ఎంతో అవగాహన పొందుతారు.. గతంలో తెరకెక్కిన ‘జనతా గ్యారజ్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఆదర్శంగా తీసుకోవాలి..

ఆ సినిమాలో ఎన్టీఆర్ ప్రకృతి ప్రేమికుడిగా చాలా అద్భుతంగా నటించాడు.. ప్రకృతికి నష్టం జరిగితే ఏ మాత్రం ఆలోచించకుండా తప్పు అని చెప్పే మనస్తత్వం వున్న పాత్రలో ఎన్టీఆర్ జీవించాడు..ఆ సినిమాలో దర్శకుడు కొరటాల శివ దీపావళి పండుగ గురించి ఎన్టీఆర్ తో అద్భుతమైన డైలాగ్స్ చెప్పించాడు.. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.. నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అనే డైలాగ్స్  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయి అంటే దీపావళి వచ్చిన ప్రతి సారి ఎన్టీఆర్ డైలాగ్స్ స్టేటస్ పెట్టుకునేంతగా పాపులర్ అయ్యాయి.. కానీ ఎంత ఎడ్యుకేట్ చేసినా మనుషులు మారరు కదా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: