అందం కోసం పాలతో స్నానం చేస్తున్న హీరోయిన్..!

Divya
సినీ సెలబ్రిటీలు తమ అందం కాపాడుకోవడం కోసం ప్రతి రోజు ఎన్నెన్నో చిట్కాలను పాటిస్తూ ఉండడమే కాకుండా కొంతమంది అందం కోసం కొన్నిటిని వదిలేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తున్న పేరు షాలిని పాసి.. ఈమె నటిగానే కాకుండా ఇండియాలోనే అత్యధికంగా పారిశ్రామికవేత్త భార్యగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ హిట్ రియాల్టీ షోలతో పాటు బాలీవుడ్ లో మరిన్ని షోలు చేసి షాలిని మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఇలా షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న షాలిని గూగుల్లో ఈమె గురించి ఎక్కువగా వెతికేస్తూ ఉన్నారట. మరొకవైపు ఈ ఆమ్మడి గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతున్నది.. షాలిని సంపద కోసమే కాదు అందానికి కూడా పెట్టింది పేరు తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఈమె పాలతో కూడా స్నానం చేస్తుందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. ఈ విషయం పైన షాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పాలతో స్నానం చేస్తానని విషయంలో ఎలాంటి నిజం లేదు.. షోలో తనని అడిగిన ప్రతిదానికి కూడా తాను అవునని చెబుతాను కాబట్టే తాను వివరించనవసరం లేదు అంటూ తెలిపింది.

రూమర్స్ కి తాను అవునని చెప్పినప్పటికీ కూడా షోలో తన అలవాట్ల గురించి ఎవరికి తాను వివరంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ షాలిని వెల్లడించింది.. తాను నివసించే ప్రాంతంలో అసలు ఆవులు, మేకలు, గుర్రాలు ఉండడానికి అనుమతి లేదు.. ఇది నియమం కాబట్టి తాను పాలతో ఎలా స్నానం చేస్తానని ఇది కేవలం రూమర్స్ మాత్రమే అంటూ వెల్లడించింది షాలిని పాసి. మొత్తానికి ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: