డాకు మహారాజ్ విషయంలో నిరాశపరిచిన థమన్.. ట్రైలర్ విషయంలో విమర్శలు!
ఇతర సినిమాల వర్క్స్ తో బిజీగా ఉండి థమన్ ఈ సినిమాకు అన్యాయం చేశాడా? లేక ఈ తరహా సినిమాలకు థమన్ అదిరిపోయే బీజీఎం ఇవ్వలేడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. డాకు మహారాజ్ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా ఈ పాటలలో ఒక్క పాట కూడా ఛార్ట్ బస్టర్ కాలేదు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పోల్చి చూస్తే డాకు మహారాజ్ వెనుకబడింది.
థమన్ ఔట్ పుట్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. బీజీఎం రొటీన్ గా ఉందనే విషయాన్ని బాలయ్య అభిమానులు సైతం అంగీకరిస్తున్నారు. మరోవైపు డాకు మహారాజ్ సినిమాకు తమ సపోర్ట్ ఉండబోదని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. బాలయ్య నోటి వెంట జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా రాకపోవడంతో ఈ కామెంట్లు చేస్తున్నారు.
అన్ స్టాపబుల్ షోకు ఎంతోమంది హీరోలు హాజరైనా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం హాజరు కాలేదు. బాలయ్య ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. డాకు మహారాజ్ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.