జూనియర్ ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలలోకి ఆ మూవీ చాలా ప్రత్యేకం.. లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా సరే మనకంటూ ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటారు . అయితే చాలామందికి ఒక హీరోనే ఫేవరెట్ గా ఉంటారు . ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రభాస్.. రామ్ చరణ్ ఫాన్స్ కి రాంచరణ్.. బన్నీ ఫ్యాన్స్ కి బన్నీ . అయితే అందరి హీరోల ఫ్యాన్స్ కి కూడా కామన్ గా నచ్చే హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోక తప్పదు . మహేష్ బాబు ఫ్యాన్స్ ..బన్నీ ఫాన్స్ ..ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా తారక్ నటనను బాగా లైక్ చేస్తూ ఉంటారు .


తారక్ నటించే సినిమాలు పై రివ్యూ కూడా ఇస్తూ ఉంటారు . కాగా తారక్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ప్లాప్ అయ్యాయి. అయితే తారక్ పరసనల్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన మూవీ మాత్రం "నాన్నకు ప్రేమతో" అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు . నాన్నకు ప్రేమతో సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా చాలా స్పెషల్ . ఇది మొత్తం ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా.  సుకుమార్ చాలా చాలా ఎమోషనల్ గానే ఈ సినిమాను తెరకెక్కించారు .


ఈ సినిమా మంచి విజయమే అందుకుంది . అయితే తారక్ కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి . కానీ అన్ని సినిమాల కన్నా కూడా నాన్నకు ప్రేమతో సినిమా నే.. ఆయనకి మోస్ట్ మోస్ట్ స్పెషల్ .ఈ మూవీలో నటించేటప్పుడు జరిగిన సిచువేషన్స్ .. సీన్స్.. ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుడ్ మెమోరీ అంటూ కూడా చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పైకి కఠినంగా కనిపించిన చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అని నాన్నకు ప్రేమతో సినిమా ద్వారానే ప్రూవ్ అయింది. ప్రసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు తారక్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: