విశ్వంభర మౌనంలో సమాధానం లేని ప్రశ్నలు !

Seetha Sailaja
‘ఆచార్య’ ‘భోళాశంకర్’ మూవీలు భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంతో ఎలర్ట్ అయిన చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పై అంచనాలు బాగా ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈమూవీ వాస్తవానికి ఈసంక్రాంతికి విడుదల కావలసి ఉంది.

అయితే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం ఈమూవీ విడుదలను సమ్మర్ రేస్ కు వాయిదా వేశారు. లేటెస్ట్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే సినిమాకు సంబంధించిన వార్తలకు జరిగిన హడావిడి తెలిసిందే. అయితే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘విశ్వంభర’ మూవీ హడావిడి ఏమాత్రం లేకుండా మౌనముద్రలో ఈ మూవీ యూనిట్ కొనసాగుతూ ఉండటం మెగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత కొంతకాలంగా చిరంజీవి దర్శకుడు అనీల్ రావిపూడితో సినిమా చేయబోతున్నట్లు వార్తల హడావిడి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కనీసం ప్రారంభం కాని చిరంజీవి సినిమాలకు సంబంధించిన హడావిడి విశ్వంభర విషయంలో ఎందుకు జరగడంలేదు అన్న సందేహాలు మెగా అభిమానులలో ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీని అన్నీ అనుకూలిస్తే ఏప్రియల్ లేదా మే నెలలో విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతల ప్లాన్ అని అంటున్నారు..  

తెలుస్తున్న సమాచారంమేరకు ‘గేమ్ ఛేంజర్’ హడావిడి పూర్తి అయిన తరువాత ‘విశ్వంభర’ మూవీ ప్రమోషన్ ను ప్రారంభించాలని చిరంజీవి ఆలోచన అని అంటున్నారు. ఈ సంవత్సరం ఆగష్టులో రాబోయే చిరంజీవి పుట్టినరోజుతో అతడి వయస్సు 70 సంవత్సరాలు దాటిపోతుంది. అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తూ నెటితరం యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే. ఈ వయస్సులో కూడ చిరంజీవి తన ఫిజిక్ విషయంలో శ్రద్ధ పెడుతూ తన బరువును తగ్గించుకుని అందరికీ షాక్ ఇస్తున్నాడు..   .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: