2024: క‌మ‌ల నాథులు సూప‌ర్ హిట్ కొట్టిన సంవ‌త్స‌రం...!

RAMAKRISHNA S.S.
ఏపీకి చెందిన బీజేపీ నాయ‌కుల్లో ఎవ‌రైనా హ్యాపీగా ఉన్నారంటే.. ఆ నేత పురందేశ్వ‌రి మాత్ర‌మే. 2024 ఆమె జీవితాన్ని మేలు మ‌లుపు తిప్పింది. వ‌రుస‌గా ఎదురైన ప‌రాజ‌యాల‌ను ఓర్చుకున్నా.. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఆమెను విజ‌య‌తీరాల‌ను చేర్చి.. రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానం నుంచి గెలుపు గుర్రం ఎక్కించింది ఈ ఏడాదే. దీంతో స‌హ‌జంగానే పురందేశ్వ‌రి హ్యాపీ అవుతారు. ఇదేస‌మ‌యం లో ఆ పార్టీలో చాలా మంది నాయ‌కులు కూడా ఈ సంవ‌త్స‌రం విజ‌యం అందుకున్నారు.

విజ‌య‌వాడ నుంచి పోటీ చేసిన‌.. సుజనా చౌద‌రి ఎమ్మెల్యే అయ్యారు. అన‌కాప‌ల్లి వంటి త‌న‌కు తెలియ‌ని నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన సీఎం ర‌మేష్ ఏకంగా ఎంపీ అయ్యారు. ఇక‌, త‌న‌కు టికెట్ ఇచ్చార‌న్న ఆనందం ఉన్నా.. గెలుపు గుర్రం ఎక్కుతాన‌న్న సంతోషం లేద‌ని ఎన్నిక‌ల‌కు ముందే చెప్పిన శ్రీనివాస వ‌ర్మ‌.. న‌ర‌సాపురం నుంచి గెల‌వ‌డ‌మే కాదు.. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఇలా.. ఈ సంవ‌త్స‌రం చాలా మందికి అదృస్టాన్ని మోసుకు వ‌చ్చింద‌నే చెప్పాలి.

స‌మ‌స్య‌లు లేవా..?
ఇదేస‌మ‌యంలో బీజేపీ నేత‌ల మ‌ధ్య స‌మ‌స్య‌లు లేవా? అంటే.. 2024లో ఉన్నన్ని స‌మ‌స్య‌లు ఎప్పుడూ వారికి ఎదురు కాలేదు. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా సాగిన రాజ‌కీయాల్లో సీనియ‌ర్లుగా ఉన్న సోము వీర్రాజు, విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి వంటివారు ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇదేస‌మ‌యంలో అప్ప‌టిక ప్పుడు బీజేపీ జెండా క‌ప్పుకొన్న న‌ల్ల‌మిల్లి వంటివారు హ‌వా చ‌లాయిస్తున్న ప‌రిస్థితి ఉంది. దీనికి తోడు స‌ఖ్య‌త లేమి పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌లేని ప‌రిస్థితి కూడా 2024లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

మ‌రీ ముఖ్యంగా పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని బీజేపీ నేత‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నా.. నాయ కుల మ‌ధ్య కొర‌వ‌డిన స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణం.. దీనిని బ‌దాబ‌ద‌లు చేసింది. మొత్తంగా చూస్తే.. బీజేపీకి సంతోషం క‌లిగించినా.. నాయ‌కుల మ‌ధ్య దూరం అయితే.. పెరిగిపోయింది. దీంతో నాయ‌కులు క‌నిపిస్తు న్నా.. బీజేపీ మాట అయితే.. వినిపించ‌డం లేదు. బీజేపీ జెండాలు కూడా క‌నిపించ‌డం లేదు. ఇవ‌న్నీ వీరికి అవ‌స‌ర‌మూలేదు. ఏదేమైనా 2024 క‌మ‌ల నాథుల‌కు ఖుషీ నింపింద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: