హైదరాబాద్ వాసులకు న్యూఇయర్ గుడ్‌న్యూస్.. మరిన్ని రైళ్లు?
ఈ జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 80 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఫలక్‌నుమా, లింగంపల్లి, ఘట్‌కేసర్, మేడ్చల్ మార్గాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరికొన్ని రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే తెచ్చింది.
ఇప్పటి వరకు మేడ్చల్ మార్గంలో ఒకే సర్వీసు ఉండగా.. నేటి నుంచి మరో మూడు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. తెల్లాపూర్ వరకు కొన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఫలక్‌నుమా, లింగంపల్లి మార్గంలో నడిచే రైళ్ల వేళల్లో మార్పులు చేసి.. ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చింది.