మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ మరియు పాటలు చిత్రం పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండడంతో తప్పకుండా చూడాలి అన్న ఇంటరెస్ట్ ప్రేక్షకులలో నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమాల్లో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. యంగ్ లుక్ లో ఐఏఎస్ పాతలో నటిస్తుండడంతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రలోనూ ఇరగదీయనున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు అంజలి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కథలో అంజలిదే ప్రముఖ పాత్ర అని కూడా ప్రచారం జరుగుతుంది. ఆమె పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై తాజాగా అప్డేట్ వచ్చింది. జనవరి 2 తేదీన సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఆట మొదలైంది అంటూ పంచకట్టుతో ఉన్న రామ్ చరణ్ ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో చరణ్ అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో గేమ్ ఛేంజర్ పై కూడా పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను చెర్రీ రీచ్ అవుతాడా లేదా అనేది తెలియాలి అంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.