కూటమి ప్రభుత్వం సంచల నిర్ణయం.. మంత్రివర్గ ప్రక్షాళన..?

frame కూటమి ప్రభుత్వం సంచల నిర్ణయం.. మంత్రివర్గ ప్రక్షాళన..?

Amruth kumar
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మంత్రివర్గ ప్రక్షాళన చేయనుందాం ? లేదా మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం కానుందా ? అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కూర్పు వరకు మాత్రమే పరిమితం కాబోతుంద‌న్ననే వాదన ఓవైపు గట్టిగా వినిపిస్తుంది . ఇదే క్రమంలో నాణేనికి మ‌రో కోణంఅన్నట్టుగా ప్రక్షాళన చేయవచ్చు అని సమాచారం కూడా బయటకు వస్తుంది . ఇక దీంతో మంత్రి పదవులు ఆశించే సీనియర్ నాయకులు , జూనియర్ ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో చోట్టు కోసం క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి కార్యాలయంలో దీనికోసం ప్రత్యేకంగా ఓ డాష్ బోర్డును అనధికారకంగా అమలు చేస్తున్నారట .  అలాగే సీఎంఓ కు వస్తున్నారు తమ వివరాలు పార్టీకి చేసిన సేవలు వారికి అందిస్తూ పుస్తకాల్లో తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది . అయితే నిజానికి ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉంది .. ఇక అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు ఇటీవల ఎమ్మెల్సీగా విజయం సాధించిన నాగబాబు ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది .. దీనికి గతంలోని సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

ఇదే క్రమంలో మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులు చేసిన పనుల కార‌ణంగా ప్రక్షాళన కూడా చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తుంది .. మంత్రుల పనితీరు పై గత కొన్ని రోజుల కింద సీఎం చంద్రబాబు పెద్ద నివేదికను కూడా విడుదల చేశారు .. అయితే ఇందులో ముగ్గురి నుంచి ఐదు మంత్రుల పనితీరు సరిగా లేదని కూడా రిపోర్టులో వచ్చింది .  ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని .. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల సమయం గడిచింది .. ఈ క్రమంలో ఆ ముగ్గురు నలుగురిని మార్చేయడం ఖాయమని కూటమి ప్రభుత్వ పెద్దల్లో చర్చ నడుస్తుంది .

అయితే దీంతో ఇప్పుడు మూడు నాలుగు స్థానాలు ఖాళీ అయినా తమ‌కు ఆకాశం దక్కకుండా ఉంటుందా అని చాలామంది నాయకులు ఎదురుచూస్తున్నారు .  అయితే ఇప్పుడు ఈ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు కూడా ఈ విష‌యం చేరిందట .. నిజానికి ఆయన ఈ జాబితాను తీసుకోవాలని కానీ ఇలా సీఎంవోలోనే  డాష్ బోర్డు ఏర్పాటు చేయల‌ని కాని ఎవరికీ చెప్పలేదు .. నేతల తాకిడి భరించలేక ఒకీలక‌ మంత్రి తమ తమ పేర్లు ఇవ్వాలని నాయకులకు చెప్పారు .. ఇక దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఇలా క్యూ కట్టారు .  ఇక ఈ జాబితాలో అందరూ సీనియర్ నాయకులే ఉండటం .. ఇందులో ఎవరిని కదుపిన పెద్ద గందరగోళం ఖాయమని ఎలాంటి నిర్ధారణకు రాకుండా చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు .. మరి రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాలి .  అలాగే వచ్చే ఉగాది తర్వాత మంత్రివర్గంలో కీలక మార్పులు కాయంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: