హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?
నటుడు రాజేష్ రెండు జెళ్ళ సీత ,ఆనంద భైరవి వంటి తదితర చిత్రాలలో కూడా నటించారట. ఐశ్వర్య రాజేష్ తాతా కూడా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అలాగే ఈయన నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించారట. ఐశ్వర్య రాజేష్ మేనత్త నటి శ్రీలక్ష్మి.. ఈమె ఎన్నో చిత్రాలలో కమెడియన్గా నటించిన మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సుమారుగా 500 కు పైగా చిత్రాలలో నటించింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి హీరోగా కొన్ని సినిమాలలో నటించిన సమయంలో ఐశ్వర్య రాజేష్ ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట.
నటుడు రాజేష్ సంపాదించిన డబ్బులను సైతం దానధర్మాలకే అంకితం చేశారట. ఆ తర్వాత నెమ్మదిగా రాజేష్ మద్యానికి బానిస కావడంతో తన ఆరోగ్యం మొత్తం నాశనం అయ్యిందట..దీంతో ఐశ్వర్య తల్లి ఐశ్వర్యతో పాటు ముగ్గురు అన్నయ్యలు కూడా పెంచడానికి చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ఉండేదట. అయితే ఇలాంటి సమయంలోనే ఐశ్వర్య రాజేష్ తండ్రి లివర్ చెడిపోవడంతో మరణించారు.. అప్పట్లోనే తన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ.. అప్పుల వాళ్లు డబ్బులు కట్టాలని తమ ఇంటి నుంచి బయటకు గెంటేసారట .కానీ పిల్లలను బాగా చదివించాలని ఐశ్వర్య రాజేష్ తల్లి అనుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఇద్దరు పెద్ద కుమారులు మరణించారట.
ఈ విషయం ఆమెను తీవ్ర డిప్రెషన్కు గురిచేసి ఐశ్వర్య రాజేష్ తల్లి మంచానికే పరిమితమయ్యేలా చేసిందట. దీంతో ఐశ్వర్య రాజేష్ పలు రకాల సీరియల్స్ లో నటించడానికి సిద్ధమయ్యిందట. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నటిస్తూ కేవలం 500 రూపాయలు అందుకునేదట. నెమ్మదిగా సినిమాలలోకి వచ్చి బాగానే సంపాదిస్తుందట ఐశ్వర్య రాజేష్. అయితే ఇలా ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఈమె కలర్ గురించి చాలామంది ఆమెను ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.