సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వెంకీమామ హిట్ సాధించాల్సిందే.. ఫైనల్ టెస్ట్ అంటూ?
వెంకటేశ్ కెరీర్ లోని హైయెస్ట్ బడ్జెట్ సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఒకటి. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గట్టి పోటీ ఉంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
వెంకటేశ్ గత సినిమా సైంధవ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అయితే సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వెంకటేశ్ ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం అందుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రమోషన్స్ కూడా కొత్తగా చేస్తున్నారు. వెంకటేశ్ కు సోషల్ మీడియా వేదికగా కూడా క్రేజ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వెంకటేశ్ భిన్నమైన ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వెంకటేశ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేశ్ నుంచి అభిమానులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి సినిమా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వెంకీమామ 2025లో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.