నాచురల్ స్టార్ నాని కొన్ని సంవత్సరాల క్రితం ఎంసీఏ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వేణు శ్రీరామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2017 డిసెంబర్ 21 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నేటితో ఏడు సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి ఈ సినిమాకు ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.
టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 14.22 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 5.25 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.10 కోట్లు , ఈస్ట్ లో 2.45 కోట్లు , వెస్ట్ లో 1.81 కోట్లు , గుంటూరు లో 2.26 కోట్లు , కృష్ణ లో 2.1 కోట్లు , నెల్లూరు లో 1.08 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 33.28 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ లలో కలిపి ఈ మూవీ కి 6.56 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 39.84 కోట్ల కనెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఎంసీఏ సినిమాకి 29.23 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 39.84 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దానితో బయ్యర్లకు ఈ సినిమా ద్వారా 10.61 కోట్ల లాభాలు దక్కాయి. అలా ఎంసీఏ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.