2024లో నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

మన సౌత్ ఇండస్ట్రీ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంది. అలాంటి ఇండస్ట్రీలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు వచ్చాయి. అలాగే కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్ అయ్యి నిర్మాతలకు కన్నీళ్లు తెప్పించాయి. అలా డిజాస్టర్ అయిన ఐదు సినిమాలు ఏవో చూద్దాం.
1) మిస్టర్ బచ్చన్ :
హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ రీమిక్స్ సినిమా ఎంత మిస్ఫైర్ అయిందో అందరికీ తెలిసిందే. తొలి ఆట నుంచి ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. స్లో నెరేషన్ రన్ టైం ఎక్కువ కావటం ..  సినిమాలో ఏ మాత్రం మజా లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు రు. 50 కోట్ల నష్టాలు వచ్చాయి.
2) డబుల్ ఇస్మార్ట్ :
పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ సొంత బ్యాన‌ర్ లో 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు కేవలం 20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్‌గా రు. 70 కోట్లకు పైగా భారీ నష్టాలు ఈ సినిమాకు వచ్చాయి.

3) ఫ్యామిలీ స్టార్ :
విజయ్ దేవరకొండ - డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్లో గీతగోవిందం కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు. దిల్ రాజు ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే కేవలం 23 కోట్ల వసూల్లో రాబట్టి 30 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది.
4 ) మట్కా :
డైరెక్టర్ కరుణ్ కుమార్ - వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో తీస్తే కేవలం మూడు కోట్ల గ్రాస్ రాబట్టి ఈ ఏడాదిలోనే అత్యంత భారీ డిజాస్టర్ గా సినిమాగా నిలిచింది.
5) సైంధ‌వ్ :
విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది టాప్ ఫైవ్ డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు 20 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: