అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..ఇవేం పనికి మాలిన పనులు బేబీ..!?
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎస్ కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట గోవాలో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ వీళ్ళ పెళ్లి జరుపుకున్నారు . ఆంటోనీ తట్టిల్ క్రిస్టియన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రెండు సాంప్రదాయాలను గౌరవిస్తూ చాలా ఆహ్లాదకరంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు . అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ ఏ మాల్దీవ్స్ కో.. ఏ వేరే కంట్రీ కి వెళ్ళిపోతుంది అని అంతా అనుకున్నారు .
హనీమూన్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది అంటూ ఆశపడ్డారు. కానీ అది ఏమీ జరగలేదు . కీర్తి సురేష్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెరిసింది . అది కూడా మెడలో పసుపు తాళితో. దీంతో ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోయారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ "బేబీ జాన్" మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే . బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న "బేబీ జాన్" సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. కీర్తి సురేష్ సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి . మెడలో పసుపు తాళితో రెడ్ కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపించింది . దీంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . కీర్తి సురేష్ ఇలా చేస్తుంది అని ఊహించలేకపోయారు జనాలు..!