రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసిన .. స్టార్ హీరో హోదా అందుకోలేకపోయిన హీరోలు వీరే..!
అయితే బాహుబలి కి ముందు రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు ఇప్పటికీ స్టార్ స్టేటస్ ను అందుకోలేదంటే అతిశయోక్తి కాదు .. మరి అలా రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేసి ఇప్పటికీ స్టార్ స్టేటస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు ఎవరు ఇక్కడ చూద్దాం. నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని .. ఇప్పటికీ స్టార్ హీరో హోదా ని దక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు .. ఇక అలా మొదలైంది , పిల్ల జమిందార్ లాంటి చిన్న సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నా నానికి రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా చేసే అవకాశం వచ్చింది .. ఇక దాంతో ఆయన ఒక్కసారిగా స్టార్ హీరోగా మారతారని అందరూ అనుకున్నారు.. కానీ అందరూ ఊహించిన విధంగా కాకుండా ఇప్పటివరకు ఆయన ఎన్నో సినిమాలు చేసిన టైర్ 2 హీరో గానే కొనసాగుతున్నాడు. మరో యంగ్ హీరో నితిన్ ..
రాజమౌళి దర్శకత్వంలో సై సినిమా చేసే అవకాశం వచ్చింది .. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఆ తర్వాత నితిన్ చేసిన ప్రతి సినిమా కూడా ప్లాఫ్ అవడంతో ఆయన ప్రేక్షకుల్లో తన ఇమేజ్ని కోల్పోయారు.. తర్వాత ఇష్క్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు... కానీ ఇప్పటికే స్టార్ స్టేటస్ కోసం పోరాడుతున్నాడు. మరో అగ్ర కమెడియన్ ప్రస్తుత స్టార్ నటుడు సునీల్ ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టిన మూవీ మర్యాద రామన్న .. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించి మంచి విజయం అందుకున్నారు .. కమీడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఈ సినిమాతో హీరోగా మరింత పాపులాటి అందుకున్నారు.. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశారు .. కానీ అవి సరిగ్గా ఆడకపోవటంతో సరైన గుర్తింపు రాలేదు .. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఈ ముగ్గురు.. మంచి సినిమాలు చేసిన ఇప్పటికీ స్టార్ హీరో స్టేటస్ కోసం పోరాడుతున్నారు..