వార్నీ..పుష్ప2లో ఆ పేరు వెనుక ఇంత కథ ఉందా.. సుక్కు నీకు దండ వేసి దండం పెట్టాలి అయ్యా..!

Thota Jaya Madhuri
పుష్ప2 సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ , రష్మిక మందన్నా తర్వాత బాగా మాట్లాడుకునే పేరు "కావేరి". పుష్ప రాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ఎంతలా ఒదిగిపోయాడో..శ్రీవల్లి క్యారెక్టర్ లో రష్మిక ఎంత ఒదిగిపోయిందో అంతలా కావేరీ క్యారెక్టర్ లో పావని ఒదిగిపోయింది.  అల్లు అర్జున్ అన్న కూతురుగా ఆ పాత్రలో జీవించేసింది పావని. పుష్ప 2 సినిమా హిట్ అవ్వడానికి పావని క్యారెక్టర్ కూడా బిగ్ ప్లస్ గా మారింది .


మరీ ముఖ్యంగా పుష్ప2 లో అసలు కథ లేదు. ఏదో ముందుకు తీసుకెళ్లిపోయాడు సుకుమార్ . కానీ పావని క్యారెక్టర్ అంతో ఇంతో సినిమాకి భారీ హైప్ ఇచ్చి.. మళ్లీ ట్రాక్లో పడేలా చేసింది . కాగా  రీసెంట్గా కావేరి పాత్రలో మెరిసిన పావని కి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . పుష్ప 2 తర్వాత ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా మారిపోయింది . ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర కి "కావేరి" అనే పేరు పెట్టడం వెనక ఉన్న అర్ధాన్ని బయటపెట్టింది .


సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవస్తుందట . జాతర సీన్ కూడా కంప్లీట్ అయిపోయిందట . అయితే సుక్కు ఆమెని పిలిచి నీ పేరేంటి అని అడగ్గా.. పావని సార్ అంటూ చెప్పిందట.  అప్పటివరకు కూడా షూటింగ్లో అందరూ ఆమెను పావని పావని అనే పిలిచేవారట . అయితే నీ పాత్రకు పేరును ఫిక్స్ చేస్తున్నాను అంటూ కావేరి అని ఫిక్స్ చేశారట . దానికి అర్థం కూడా వివరించారట . కావేరి అనేది ఒక నది . అటు తమిళనాడు ను ఇటు కర్ణాటకను కలుపుతుంది . నీ పేరు లాగే ఇక్కడ పుష్ప కుటుంబాన్ని నువ్వే కలపాలి అంటూ సింబాలిక్ గా పేరు పెట్టారు అంటూ చెప్పుకొచ్చింది . ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . సుకుమార్ అనాలసిస్ కి ఫిదా అయిపోతున్నారు . నిజంగా నువ్వు గ్రేట్ సుక్కు అంటూ నీకు దండేసి దండం పెట్టాలయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: