పవన్‌తో బన్నీ రాజీ... త్రివిక్రమ్ ద్వారా రాయభారం..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోనూ తిరుగులేని హవా చలాయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మధ్య కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం కొంతకాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ ను కలవడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా ? అంటే టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో అలాంటి గుసగుసలు నడుస్తున్నాయి. బన్నీ జైలు నుంచి వచ్చాక రెండు రోజుల ఓదార్పు ... పరామర్శల కార్యక్రమం ముగిసిన తర్వాత తానే నేరుగా తన భార్య స్నేహారెడ్డి తో కలిసి మెగాస్టార్ ఇంటికి ... నాగబాబు ఇంటికి వెళ్లారు. రాజకీయాల్లోనే కాదు ఇలాంటి ఫ్రెండ్షిప్లు ... బ్రేకప్ లు సినీ రంగం లోనూ కామన్. ఇదే ఊపులో మంగళగిరి వెళ్లి పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలవాలని అనుకున్నారట.
ఈ మేరకు అటు పవన్ కు ఇటు తనుకు సన్నిహితుడైన డైరెక్టర్ మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అటు నుంచి నో అన్న సమాధానం రాలేదు కానీ .. అసలు రెస్పాన్స్ వెయిటింగ్ లో పెట్టేసారట. దీనిని బట్టి బన్నీ ని కలిసేందుకు పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా ఇష్టం లేదన్న సంకేతాలు వచ్చేసాయని అంటున్నారు. సంధ్య థియేటర్ ఘటన ... బన్నీ అరెస్టు ముందు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వ్యవహారం వేరుగా ఉండేది.
బన్నీ తాను వేరే తన అల్లు కుటుంబం వేరే .. మెగా కుటుంబం వేరు అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య యుద్ధం కూడా అలాగే ఉండేది. అయితే పుష్ప 2 సినిమా హిట్ అయ్యాక సంధ్య థియేటర్ సంఘటన తర్వాత మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ స్పందించలేదు .. కనీసం మెగా హీరోలు కూడా వచ్చి కలవలేదు. ఇలాంటి నేపథ్యంలో బన్నీ నేరుగా వెళ్లి మెగా పెద్దలను కలిసి వచ్చారు. ఇక మిగిలింది పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవడం మాత్రమే మిగిలి ఉంది.