తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బెల్లంకొండ సురేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం రామ్ పోతినేని హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఈ సినిమా ద్వారానే సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన మొదటి సినిమాతోనే సంతోష్ శ్రీనివాస్ కి మంచి విజయం దక్కడంతో ఈయనకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే బెల్లంకొండ సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయనకు మెగా హీరోలతో ఎందుకు మీరు మీ కెరియర్లో ఒక్క సినిమా కూడా తీయలేదు అనే ప్రశ్న ఎదురయింది.
దానికి ఈయన సమాధానం ఇస్తూ ... కందిరీగ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాను. అందులో భాగంగా చిరంజీవి గారిని కలిసి ఓ కథను కూడా వివరించాను. కానీ చిరంజీవి గారికి మేము చెప్పిన కథ నచ్చలేదు. దానితో సైలెంట్ అయిపోయాము. అంతే కానీ మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమా చేయకూడదు అని ఉద్దేశం లేదు. చరణ్ తో సినిమా ట్రై చేసినా కూడా వర్కౌట్ కాలేదు అని బెల్లంకొండ సురేష్ తాజాగా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.