ఏంటి రష్మిక మందన్నా అలాంటి వ్యాధితో బాధపడుతుందా.. నిజంగానే ఆమెకు ఆ వ్యాధి ఉందా.. ఇంతకీ ఈ విషయాన్ని బయటపెట్టింది ఎవరు? రూమరా లేక నిజమా అనేది ఇప్పుడు చూద్దాం.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత యానిమల్ మూవీ తో బాలీవుడ్ లో కూడా పాగా వేసింది. ఇక తాజాగా విడుదలైన పుష్ప టు సినిమాతో రష్మిక రేంజ్ మరింత పెరిగిపోయింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తనకి ఒక వింత వ్యాధి ఉంది అంటూ ఓ సంచలన నిజాన్ని బయట పెట్టింది.అంతేకాదు ఈ విషయం రూమర్ కాదు స్వయంగా తన నోటి నుండి తానే బయటపెట్టిన సంచలన నిజం.ఇక పుష్ప టు సినిమా లో నటించడంతో ఈమెకు సంబంధించిన ఆ వింత వ్యాధి బయటపడింది.మరి ఇంతకీ రష్మికకి ఉన్న ఆ వింత వ్యాధి ఏంటో ఇప్పుడు చూద్దాం..
రష్మిక రీసెంట్ గా పుష్ప-2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది. ముఖ్యంగా రష్మిక బన్నీ కాంబోలో వచ్చిన ఫీలింగ్స్ అనే పాటలో తన డ్యాన్స్ తో రచ్చ రంబోలా చేసిం.ది ఈ పాటలో అల్లు అర్జున్ డాన్స్ కి దధీటుగా రష్మిక స్టెప్పులు వేసింది.అయితే ఈ సినిమాలోని ఫీలింగ్స్ పాటలో రష్మికకి ఉన్న వింత ఫోబియా బయటపడింది. అదేంటంటే.. రష్మికని ఎవరైనా పైకి ఎత్తుకుంటే చాలా భయపడుతుందట.. అయితే తనకి ఉన్న ఈ వింత ఫోబియా ఎలా బయటపడింది అంటే.. ఫీలింగ్ సాంగ్లో రష్మికను అల్లు అర్జున్ నడుము వరకు పైకి ఎత్తుకొని డ్యాన్స్ చేస్తాడు.అలాగే సూసేకి పాటలో కూడా అల్లు అర్జున్ రష్మికను ఎత్తుకొని డాన్స్ చేస్తాడు.
అయితే ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని, తనకు ఎవరైనా పైకి ఎత్తుకుంటే భయం అవుతుంది అంటూ తనకి ఉన్న ఆ ఫోబియాని బయటపెట్టింది. చాలామందికి చాలా రకాల వింత ఫోబియాలు ఉంటాయి. అలాగే నాకు ఎవరైనా పైకి ఎత్తుకుంటే భయం.. నాకు ఉన్న వింత ఫోబియా ఇదే అంటూ రష్మిక రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ఇక ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో పెళ్లయితే రౌడీ హీరోకి కష్టమే అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు