హెరాల్డ్ టాలీవుడ్ డిజాస్ట‌ర్లు 2024 : వరుణ్ తేజ్ రేంజ్ తగ్గిస్తున్న వరుస ఫ్లాపులు.. ఫ్యాన్స్ సైతం అయ్యో పాపం అనేలా?

Reddy P Rajasekhar
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలకు, ప్రయోగాత్మక సినిమాలకు ఓటు వేసే హీరోలలో వరుణ్ తేజ్ ముందువరసలో ఉంటారు. వరుణ్ తేజ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అనిల్ రావిపూడి వరుణ్ తేజ్ కాంబినేషన్ సినిమాలు, ఫిదా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదుర్స్ అనిపించాయి. అయితే వరుస ఫ్లాపులు వరుణ్ తేజ్ రేంజ్ ను తగ్గిస్తున్నాయి.
 
వరుస ఫ్లాపులను చూసి వరుణ్ తేజ్ అభిమానులు సైతం అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు. వరుణ్ తేజ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. గని, గాండీవధారి అర్జున, మట్కా సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి డిజాస్టర్లుగా నిలవడంతో పాటు వరుణ్ తేజ్ మార్కెట్ ను సైతం దెబ్బ తీశాయని చెప్పవచ్చు. మట్కా సినిమా కలెక్షన్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
 
వరుస ఫ్లాపులు వరుణ్ తేజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా ప్రభావం చూపాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వరుణ్ తేజ్ రేంజ్, మార్కెట్ కు తగిన బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ పారితోషికం ప్రస్తుతం 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుణ్ రెమ్యునరేషన్ కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వరుణ్ తేజ్ టాలెంట్ ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే ఈ పరిస్థితి మారుతుందని చెప్పవచ్చు. మెగా హీరోలలో ప్రస్తుతం వరుణ్ తేజ్ కు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వరుణ్ తేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. వరుణ్ తేజ్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. వరుణ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: