సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళంలో అభిమానులు ఎక్కువ. అందుకే ఈయనను కోలీవుడ్ సూపర్ స్టార్ అంటారు. అయితే ఈయన కేవలం కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ సూపర్ స్టారే... తన నటనతో ఎంతోమందిని ఉర్రూతలూగించిన ఈ హీరోకి ఈ ఏడాది ఎదగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈయన నటించిన లాల్ సలాం, వెట్టయాన్ అనే రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అభిమానులకు నిరాశ మిగిల్చాయి.. గత ఏడాది జైలర్ విడుదలై బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.దాంతో రజనీకాంత్ నెక్స్ట్ సినిమాలపై అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. ఇక జైలర్ సినిమా తర్వాత 2024 ఫిబ్రవరి 9న విడుదలైన లాల్ సలాం మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా రజినీకాంత్ కూతుర్ని నమ్మి బొక్క బోర్లా పడ్డాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాల్ సలాం మూవీకి రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. దాంతో చాలామంది సౌందర్య డైరెక్షన్ ని నిందించారు. కానీ సౌందర్య మాత్రం తండ్రిని నిందించింది. ఇక లాల్ సలాం మూవీలో రజినీకాంత్ తో పాటు విక్రాంత్, విష్ణు విశాల్ లు నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన లాల్ సలాం మూవీ బాక్సాఫీస్ వద్ద కనీసం 30 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేదు.ఈ సినిమా 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే కనీసం 30 కోట్లు కూడా రాకపోవడంతో రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా మొదటి రోజు కేవలం 7 కోట్ల కలెక్షన్లు మాత్రమే సంపాదించింది.
దాంతో రజినీకాంత్ అభిమానులు చాలా నిరాశపడ్డారు. అంతేకాదు జైలర్ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని వెళితే సినిమా అనుకున్నంత రేంజ్ లో లేదు. ఈ సినిమా చూసి రజినీకాంత్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు.ఇక ఆ తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన వెట్టయాన్ సినిమా బ్లాక్ బస్టర్ అనేంతలా లేదు మిక్స్డ్ టాక్ వచ్చింది.కానీ ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది అని చాలామంది కొనియాడారు. అలా ఈ ఏడాది రజినీకాంత్ కి అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం రజినీకాంత్ కూలి మూవీలో చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.కూలి మూవీ తర్వాత జైలర్ టు మూవీ చేసే పనిలో ఉన్నారు