హెరాల్డ్ టాలీవుడ్ డిజాస్ట‌ర్లు 2024 : రామ్ ఆశలను గల్లంతు చేసిన డబుల్ ఇస్మార్ట్.. భారీ నష్టాలను మిగిల్చిందిగా!

Reddy P Rajasekhar
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన రామ్ పోతినేనికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రామ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే గత కొన్నేళ్లలో రామ్ నటించిన సినిమాల్లో చాలా సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి. రామ్ నటించిన మాస్ సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.
 
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో అయినా రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. తల, తోక లేని కథనంతో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం కొసమెరుపు.
 
కథల ఎంపికలో రామ్ పోతినేని తప్పు చేస్తున్నాడని ఈ సినిమా ఫలితంతో మరోసారి ప్రూవ్ అయింది. డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చింది. పూరీ జగన్నాథ్ కు అటు దర్శకునిగా ఇటు నిర్మాతగా ఈ సినిమా భారీ షాక్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ ఆశలను ఈ సినిమా వమ్ము చేసిందని కచ్చితంగా చెప్పవచ్చు.
 
దర్శకుడు పూరీ జగన్నాథ్ కు భారీ సక్సెస్ దక్కాలని పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ కు బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కథ విషయంలో పొరపాట్లు చేయడమే ఈ దర్శకునికి మైనస్ అవుతోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: