హెరాల్డ్ టాలీవుడ్ స్టార్స్ మెరుపులు 2024 : 7 నెలల గ్యాప్ లో 2 సినిమాలతో షేక్ చేసిన ప్రభాస్.. సినిమాలు అదుర్స్!

Reddy P Rajasekhar
స్టార్ హీరో ప్రభాస్ సినిమాలు విడుదలైతే థియేటర్లు కళకళలాడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే కనీసం 700 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే. సలార్, కల్కి సినిమాలు థియేటర్లలో కేవలం ఆరు నెలల గ్యాప్ లో రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి అదరగొట్టాయనే సంగతి తెలిసిందే.
 
సలార్ మూవీ గతేడాది డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో విడుదల కాగా కల్కి మూవీ మాత్రం ఈ ఏడాది జూన్ నెల 28వ తేదీన విడుదలై మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే ప్రభాస్ సినిమాలు థియేటర్లలో విడుదలైనా నిర్మాతలు మాత్రం రెండు సినిమాల ఫలితాల విషయంలో సంతృప్తితో ఉన్నారు.
 
ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు మాత్రం ఈ మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ, కన్నప్ప మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండటం గమనార్హం.
 
ప్రభాస్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ హిందీలో సైతం అంచనాలకు మించి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్నారు. ప్రభాస్ యంగ్ డైరెక్టర్లకు, టాలెంటెడ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలను ఇచ్చారు. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: