మురళీమోహన్ మనవరాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో..?
ఇందులో భాగంగా అన్న కుమారుడు పెళ్లిలో డైరెక్టర్ రాజమౌళి డాన్స్ కూడా వేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. వీరికి వివాహం uae లో చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాదులో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా చాలామంది సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఇక శ్రీ సింహా సినిమాల విషయానికి వస్తే మొదటిసారి శ్రీ సింహ యమదొంగ చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించారట..తర్వాత దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్, తదితర చిత్రాలలో నటించారు.
మత్తు వదలరా-2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీ సింహ ఆ తర్వాత మళ్లీ తన తదుపరిచిత్రాన్ని మాత్రం ప్రకటించలేదు.. మరి వివాహమైన అనంతరం తన తదుపరిచిత్రాన్ని ప్రకటిస్తారేమో చూడాలి మరి. కీరవాణి ,రాజమౌళి కుటుంబం బంధువులు అవ్వడం చేత రాజమౌళి తన అన్న కొడుకు పెళ్లిలో డాన్స్ అందరిని ఆకట్టుకున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్ సైతం ఈ వయసులో కూడా రాజమౌళి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ సింహ కూడా ఒక ఇంటి వారు అయ్యారు దీంతో ఈ జంటకు అభిమానుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.