పుష్ప-3లో విజయ్ దేవరకొండ...క్లారిటీ ఇచ్చిన రష్మిక.!

FARMANULLA SHAIK
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా 'పుష్ప-3' కూడా ఉంటుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.ఈ నేపథ్యంలో పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఆల్రెడీ థియేటర్స్‌లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ప్రీమియర్స్ నుంచే పూనకాలు పుట్టిస్తున్నాడు పుష్ప రాజ్. ఇంటా బయటా అని తేడాలేదు అన్ని చోట్లా మోత మోగిస్తుంది పుష్ప 2. సౌత్ మాత్రమే కాదు నార్త్‌లోనూ తన నట విశ్వరూపంతో రికార్డుల జాతర చూపిస్తున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు.కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే నెల అయ్యేలోపే 2000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతా బానే ఉన్నా కొన్ని ప్రశ్నలు మాత్రం అభిమానులను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు సుకుమార్.ఈ క్రమంలో సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి దేశంలోనే నెంబర్ 1 చిత్రంగా నిలిచింది. అయితే, పార్ట్ 2 క్లైమాక్స్ లో బాంబ్ పట్టుకుని ఓ వ్యక్తి కనిపించాడు. అతను ఎవరో కాదు  పుష్ప 3  లో హీరో విజయ్ దేవరకొండ అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ ప్రశ్నలపై రష్మిక షాకింగ్ రిప్లై ఇచ్చింది.ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప 2 క్లైమాక్స్ లో కనిపించి వ్యక్తి విజయ్ దేవర కొండనా అని అడగగా.. ఆమె మీ లాగే నేను కూడా.. అతనెవరో తెలియదు. డైరెక్టర్ సుకుమార్ సీన్ సీన్ కు సస్పెన్స్ ఉండాలనుకుంటారు. లాస్ట్ మినిట్ వరకు ఆ విషయాన్ని ఎవరికీ రివీల్ చేయరు. పుష్ప 2  సీన్స్ కూడా షూట్ చేసే ముందు చెప్పేవాళ్ళు, మూవీ క్లైమాక్స్ లో అతన్ని చూసి నేను కూడా షాక్ అయ్యా.. ఇతనెవ్వరని  అంటూ ఎవరికీ అర్ధం కాకుండా భలే ఆన్సర్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: