అల్లు అర్జున్ అరెస్ట్ పై శ్రీలీల షాకింగ్ కామెంట్స్!

MADDIBOINA AJAY KUMAR
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు.
ఇక ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ పై స్పందించారు. ఆ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో చాలా కంగారు పడ్డామని చెప్పుకొచ్చారు. ఆయన జైలు నుంచి బయటకి రావడంతో రిలీఫ్ అయ్యమని తెలిపారు. జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ఆమె ప్రశ్నించారు.
శ్రీ లీలతో పాటు కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, నటి రష్మిక మందన్న, డైరెక్టర్స్ సుకుమార్, కే.రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ, హీరో రానా దగ్గుబాటి, న్యాచురల్ స్టార్ నాని మరికొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు.
నేడు ఉదయం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన సందర్బంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన నిలయానికి వచ్చి పరమర్శిస్తున్నారు.  జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యాలు చేశారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. విచారణకు సహకరిస్తానని అన్నారు. తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.తాను బాగానే ఉన్నానని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉందని ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: