అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఆ అజ్ఞాత మహిళ?

Veldandi Saikiran
టాలీవుడ్ స్టార్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ షాక్ లో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఓ మహిళ కారణం అయినట్లుగా కొంతమంది చెబుతున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆమె కుమారుడు కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ తరుణం లోనే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అల్లు అర్జున్ ఒక్కరోజులోనే బయటకు వచ్చారు. కానీ అల్లు అర్జున్ అరెస్టు వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య ముఖ్య కారణం అని అంటున్నారు. పుష్ప 2 సినిమా సక్సెస్ మీటింగ్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడారు.

అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. ఈ విషయం పైన అల్లు అర్జున్ పై పగలు పెంచుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అతని భార్య. ఈ పగ కారణంగానే రేవంత్ రెడ్డి తన భార్య ఆదేశాల మేరకు ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని టాలీవుడ్ స్టార్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేయించాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సీరియస్ అయ్యారు. అయితే ఇదంతా తన పేరు మర్చిపోయాడని ఒకే ఒక కారణం వల్ల రేవంత్ రెడ్డి భార్య ఇలా చేయించిందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: