అల్లు అర్జున్ అరెస్ట్ కు పవన్ కళ్యాణ్ కు లింక్ .. పవన్ వైజాగ్ సీన్ రిపీట్ అవబోతుందా..?

Amruth kumar
అల్లు అర్జున్ అరెస్ట్ లో రాజకీయ కోణం ఏదైనా ఉందా ? అన్న చర్చ ప్రెసెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో హాట్ టాపిక్ గా జరుగుతుంది .. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు . అదేవిధంగా ఆయనకు యూత్ లో ఫాలోయింగ్ కూడా ఎక్కువే .. ఇదే క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనకు పెరిగారు .. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అరవింద్ కొడుకు అయిన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు .. కేసు పెట్టిన పోలీసులు వారంత‌ట వారు అరెస్టు చేసేందుకు ధైర్యం చేయరు .. అందులోనూ నాన్‌బెయిల్ కేసులు పెట్ట‌డం కూడా హాట్ టాపిక్ గా మారింది .. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో రాజకీయ కోణం దాగి ఉందని ఆయన అభిమానుల నుంచి వస్తున్న అనుమానాలు .. నిన్న సాయంత్రం తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు బయలు ఇవ్వటంతో ఈరోజు ఉదయం ఆయన విడుదలయ్యారు.

 
 పుష్ప 2 విడుదలకు ముందు నుంచే ఆయన కొంత టాలీవుడ్ లోనూ అదే సమయంలో కొందరు నటులు రాజకీయ నేతల్లోనూ బన్నీపై ఈర్ష బాగా పెరిగింది.. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది .. అప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారు .. ఇక దీంతో పాటు 2024 ఎన్నికల ముందు రాజకీయ వివాదాలు ఆరోపణలో కూడా ఇరుక్కున్నారు .. 2024 ఎన్నికల సందర్భంగా నంద్యాలకు వెళ్లి వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ ఇవ్వటం పెద్ద వివాదంగా మారింది .. ఇది మిగిలిన మెగా హీరోల అభిమానులకు నచ్చలేదు .. సోషల్ మీడియా వేదికగా దీనిపై ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు .. అలాగే ప్రధాన పార్టీ నేతలు కూడా అల్లు అర్జున్ పై పలు విమర్శలు చేశారు .

 
అదే సమయంలో అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో అది నా ఇష్టం నాకు నచ్చిన చోటకి వెళ్తానంటూ ఆయన కామెంట్ చేయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది .. ఇదే క్రమంలో ఇప్పుడు పుష్ప 2 విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుంది .. క్రమంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం రాజకీయంగా కూడా చచ్చినయాంశంగా మారింది ..అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పలువురు జర్నలిస్టులు మరో కొత్త కొనాన్ని తీసుకువస్తున్నారు .. గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఆయనను కలవటానికి వచ్చిన సమయంలో పోలీసులు ఆయన అడ్డగించి నడిరోడ్డు పైన ఆపేశారు .. అయ‌ను చంద్రబాబును కలవ‌కుండా ఆయన పార్టీ ఆఫీసులో వదిలిపెట్టి అక్కడే నిర్బంధించారు.. అంతేకాకుండా తర్వాత పవన్ కళ్యాణ్ వైజాగ్ లో ర్యాలీ ప్రకటించిన దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మద్యలోని అడ్డగించి ఏర్పోర్ట్ నుంచి హోటల్‌కు తరలించారు..

 
ఇక అప్పుటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల వరకు అదే కోపంతో వైసిపిని కసితీరా ఓడించాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ సంధ్య ధియేటర్ ఘటనలో కూడా ఆయన పరిమిషన్ తీసుకుంది థియేటర్లో సినిమా చూడడానికి.. ఆయన థియేటర్లోకి ఎంటర్ అవుతూనే కొద్ది దూరం నుంచి కారులో నుంచి పైకి లేచి చెయ్యి ఊపుతూ వెళ్ళాడు .. ఇందువలన ఈతొక్కిస్లాట ఘటన జరిగిందని కొందరు ఉంటున్నారు .. అల్లు అర్జున్ తనకు రాజకీయాలకు సంబంధం లేదని, రాజకీయాల్లోకి తాను రానంటూ ప్రకటన కూడా చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీదఅల్లు అర్జున్ ను పోలీసులు ఇంత వేగంగా అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నారంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయంగా కూడా రచ్చ అయ్యే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: