బన్నీ నేషనల్ అవార్డ్ వెనక్కు ఇస్తాడా.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు వైరల్!

Reddy P Rajasekhar
అల్లు అర్జున్ బెయిల్ పై తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీని చూడటానికి ఎక్కువ సంఖ్యలో సినీ ప్రముఖులు జైలుకు తరలివస్తున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్ తనకు మాత్రమే ఉండాలని బన్నీ కుట్ర పన్నలేదా అంటూ తీన్మార్ మల్లన్న కామెంట్లు చేశారు.
 
జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అల్లు అర్జున్ కుట్ర ఉందా లేదా అని ఆయన చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చినా నేషనల్ అవార్డ్ వెనక్కు తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లా? కాదా? అంటూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. బన్నీ సైతం ప్రస్తుతం ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డ్ ను వెనక్కు ఇస్తారా అని ఆయన కామెంట్లు చేశారు. దిల్ రాజు, కొరటాల శివ, సుకుమార్, విజయ్ దేవరకొండ బన్నీని కలిశారని తెలుస్తోంది.
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, పుష్ప ది రూల్ టీమ్ కూడా బన్నీని కలిసినట్లు సమాచారం అందుతోంది. బన్నీ మరికొన్ని నెలల పాటు షూటింగ్ లకు సైతం దూరంగా ఉండనున్నారు. తీన్మార్ మల్లన్న కామెంట్లపై బన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం తీన్మార్ మల్లన్నపై ఫైర్ అవుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 
బన్నీపై ఎవరో పగబట్టి చేయించారని కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. బన్నీ భాషతో సంబంధం లేకుండా ఎదుగుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: