జమిలీ ఎలక్షన్స్: మద్దతిచ్చే- వ్యతిరేకించే పార్టీలివే..?

Divya
దేశం మొత్తం ఒకే ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అంశం గత కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ అంశాన్ని వాస్తవ రూపంలో తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలని వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపేందుకు మోడీ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టడానికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది.

అయితే జమిలి ఎన్నికలకు అవసరమైన రెండు బిల్లులను సైతం పార్లమెంటు ఆమోదిస్తే ఖచ్చితంగా జమిలి ఎన్నికల వ్యవహార చట్టబద్ధం అవుతుందట. రెండు బిళ్ళల్లో మొదటి బిల్లుకు లోక్సభ రాజ్యసభలలో సైతం మూడోవంతులలో మెజారిటీ అవసరం. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. దీనికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికల పైన కాంగ్రెస్ బంధిస్తూ బిల్లును చూసిన తర్వాతే తాము స్పందిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే దేశంలో జమిలి ఎన్నికలకు మించిన సమస్యలు చాలానే ఉన్నాయని తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో జమిలి ఎన్నికలకు మద్దతిచ్చే పార్టీలు ఏవి స్పందించని పార్టీలు ఏవి వ్యతిరేకించే పార్టీలు ఇవే అన్నట్టుగా కొన్ని వైరల్ గా మారుతున్నాయి.

ముందుగా మద్దతు ఇచ్చే పార్టీలు : బిజెపి, శివసేన, అన్నా డీఎంకే, ఆసోం గణపరిషత్, అఫ్నాదళ్, జెడియూ, బిజు జనతాదళ్, ఆకాలి దళ్, వైసిపి
వ్యతిరేకిస్తున్న పార్టీలు: కాంగ్రెస్, సిపిఎం, మజ్లిస్, డీఎంకే, సిపిఐ, బీఎస్పీ, అమ్ ఆద్మీ, టిఎంసి
స్పందించని పార్టీలు:
టిడిపి, టిఆర్ఎస్, ఎన్ సిపి, జెడిఎస్, ఆర్జెడి, కేరళ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

అయితే కొన్ని పార్టీలు బిజెపికి మిత్రపక్షులుగా ఉన్నటువంటి పార్టీలు సైతం కచ్చితంగా బిజెపికి సపోర్టు చేసేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: