ఆలస్యంగా రిలీజ్‌ చేయడంపై అల్లు అర్జున్‌ సంచలన నిర్ణయం ?

Veldandi Saikiran
టాలీవుడ్ స్టార్, ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న ఉదయం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం అరెస్టు అయిన హీరో అల్లు అర్జున్... ఇవాళ ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నిన్న రాత్రి మొత్తం చంచల్గూడా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు... మొదట 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆ తెలంగాణ హైకోర్టు యూటర్న్ తీసుకుంది.
 
మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్ కు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో... సాయంత్రం ఐదు గంటల సమయంలో అల్లు అర్జున్ బెయిల్ వస్తే... హైకోర్టు నుంచి బెయిల్ కాపీ రాలేదని... రాత్రంతా జైల్లోనే ఉంచారు. ఇక చేసేదేమీ లేక చంచల్గూడా జైల్లోనే...  అల్లు అర్జున్ ఉండడం జరిగింది. ఈ తరుణంలో ఖైదీ నెంబర్ 76 97 అల్లు అర్జున్ కు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక రాత్రి చంచల్గూడా జైల్లో నేలపైన నిద్రించారట అల్లు అర్జున్.

అయితే బెయిల్ వచ్చినప్పుడు... రాత్రంతా అల్లు అర్జున్ ను జైల్లో ఉంచడంపై... ఆయన ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా సీరియస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కక్ష కట్టి ఈ చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారట. తెలంగాణ హైకోర్టులో దీనిపై పిటిషన్ వేయాలని అనుకుంటున్నారట. అయితే ఇదే విషయంపై అల్లు అర్జున్ కు సంబంధించిన లాయర్ మాట్లాడారు.

అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ... చంచల్గూడా జైలు నుంచి ఇవాళ ఉదయం అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారని ప్రకటించారు.  హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని కానీ.. రాత్రంతా జైల్లో కావాలనే ఉంచారని మండిపడ్డారు. అధికారులకు బెయిల్ కాపీలు ఆలస్యంగా అందడం వల్ల అల్లు అర్జున నిన్న రిలీజ్ కాలేదని వివరించారు.  అల్లు అర్జున్ ఆలస్యంగా రిలీజ్ అవ్వడంపై మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని హెచ్చరించారు అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ అశోక్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: