ఆ హీరోతో గోవాకు వెళ్లిన త్రిషా...సీక్రెట్ వీడియో వైరల్ ?
కొద్దిరోజుల గ్యాప్ అనంతరం త్రిష మళ్లీ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా.... గత కొన్ని రోజుల క్రితం త్రిష, తమిళ్ హీరో విజయ్ కి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో లవ్ రిలేషన్ నడుస్తున్నట్లుగా రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. కాగా, త్రిష ఇంతవరకు ఎలాంటి ఐటమ్ సాంగ్ లలో నటించలేదు. కానీ విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మొదటిసారిగా నటించింది.
దీంతో ఒక్కసారిగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటివరకు ఎలాంటి స్పెషల్ సాంగ్స్ లో నటించని త్రిష విజయ్ సినిమాలో నటించేసరికి వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ కారణంగానే త్రిష స్పెషల్ సాంగ్ చేసిందని రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా త్రిష, విజయ్ కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గోవాలో నటి కీర్తి సురేష్ వివాహం జరిగింది.
కీర్తి సురేష్ వివాహానికి సినీ నటులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే విజయ్, త్రిష ఇద్దరూ కలిసి కీర్తి సురేష్ వివాహానికి వెళ్లారు. ఈ వీడియో చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో రిలేషన్ కొనసాగుతున్నట్లుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలపై విజయ్ గానీ, త్రిష గానీ ఎవరో ఒకరు స్పందిస్తే గానీ ఇలాంటి రూమర్స్ కు ముగింపు ఉండదు.