అందరూ అనుకున్నట్టే చేసిన శోభిత... నాగచైతన్య బిహేవియర్ పై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్..ఏమైందంటే..?

Thota Jaya Madhuri
నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు.. అది కూడా ఒక హీరోయిన్ ని చేసుకోబోతున్నాడు అని తెలియగానే ముందు జనాలు షాక్ అయిపోయారు. అంతేకాదు శోభిత ధూళిపాళ్ల పేరు తెర పైకి రాగానే జనాలు ఓ రేంజ్ లో మండిపడ్డారు . కానీ నాగచైతన్య మాత్రం అలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. అదే విషయం బాగా ట్రెండ్ అవుతూ వచ్చింది . డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య అదే విధంగా శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరిగింది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగింది . పెళ్లి తర్వాత శ్రీశైలం మల్లన్న ని కూడా దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు కొత్తజంట.


అక్కినేని నాగార్జున కొడుకు లైఫ్ సెటిల్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డాడు అని ..ఆ క్లిప్స్ ఆ వీడియోస్ ద్వారా తెలిసిపోతుంది . రీసెంట్ గా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల జంటగా మెరిసారు . అనురాగ్ క్యాశప్  కుమార్తె అలియా క్యాసప్ వెడ్డింగ్ రిసెప్షన్లో ఫస్ట్ టైం భార్యాభర్తలుగా కనిపించారు నాగచైతన్య అదేవిధంగా శోభిత.  వాళ్ల పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.  మరి ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ళ డ్రెస్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు అది డ్రెస్సేనా ..? పద్ధతిగా చీర కట్టుకోవచ్చుగా అంటూ కొంతమంది ఘాటుగా ట్రోల్ చేస్తుంటే.. అసలు ఆమె అక్కినేని ఇంటికి కోడలు అయ్యే అర్హత లేదు అంటూ కూడా ఘాటు మాట్లాడుతున్నారు.


కాగా చాలామంది మాత్రం నాగచైతన్య బిహేవియర్ పై ఫైర్ అయిపోతున్నారు . ఫంక్షన్ మొత్తం శోభిత ధూళిపాల వెనకే తిరుగుతూ వచ్చాడు అని .. నాగచైతన్యను అలా చూడలేకపోయాము అంటూ మండిపడుతున్నారు . మరికొందరు మాత్రం తన భార్య తన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు మీకేంటి రా బాధ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. కానీ ఆ రిసెప్షన్లో మాత్రం నాగచైతన్య  కూసింత ఓవర్ చేసినట్టు చూసిన జనాలు మాట్లాడుతున్నారు .అంతేకాదు శోభిత ని అస్సలు వదల్లేదు అని ..ఎక్కడికి వెళ్ళినా సరే చెయ్యి పట్టుకొని అలాగే ఉన్నారు అని మాట్లాడుతున్నారు . కొంతమంది దీన్ని కొత్త మోజు అంటుంటే మరి కొంతమంది మాత్రం భార్య అంటే అంత ప్రేమ అంటున్నారు. మొత్తానికి శోభిత్తా ధూళిపాళ్ల వెనకే నాగచైతన్య  తిరగబోతాడు అంటూ ముందే గెస్ చేసిన జనాలు దీన్ని లైట్గా తీసుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: