పవర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకోండి .. ఓజీ వచ్చేస్తున్నాడు ..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా రోజుల తర్వాత సినిమాలు గుర్తుకొస్తున్నాయి .. అందుకే ఆయన ఓకే అన్నపుడే అన్ని పనులు ఒకేసారి కాని చేస్తున్నారు దర్శకులు నిర్మాతలు .. ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు కోసం కొన్ని రోజుల షూటింగ్లో పాల్గొన్నారు పవర్ స్టార్ .. ఇక ఇప్పుడు తాజా గా ఓ జి మూవీ వంతు కూడా వచ్చింది .. ఓజి సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ బ్యాంకాక్ లో  మొదలు కానుంది .. ఇదే విషయాన్ని అధికారికం గా చిత్ర యూనిట్ ప్రకటించింది ..
ఇక నిజాని కి 2023 లోనే ఓజీ షూటింగ్ 70% పూర్తి చేశాడు దర్శకుడు సుజిత్ .. ఇక‌ ఇప్పుడు అదే ఊపులో పవన్ మరో రెండు వారాలు డేట్స్ ఇచ్చుంటే ఈపాటికి ఓజి మూవీ గత సంవత్సరమే కంప్లీట్ అయి ఉండేది .. కానీ ఆ స‌మ‌యం లోనే రాజకీయాల్లో బిజీ అయ్యారు జనసేనని .. తర్వాత ఎన్నికలు గెలుపు ఉప ముఖ్యమంత్రి గా బాధ్యత లతో క్షణం తీరిక లేకుండా బిజీ గా మారిపోయారు పవన్ . ఇక దాంతో ఓజి అలాగే మిగిలిపోయింది  .. ఇకు ఇప్పుడు తాజా గా ఓజి కొత్త షెడ్యూల్ బ్యాంకాక్ తో పాటు థాయిలాండ్ లో ను షూటింగ్ జరగనుంది ..

ఇక ఇప్పటికే చిత్ర‌ యూనిట్ అక్కడ ల్యాండ్ అవ్వటమే కాదు పవన్ లేని సీన్స్  చిత్రీకరిస్తున్నారు . డిసెంబర్ చివర లో పవన్ కళ్యాణ్ మెయిన్ షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి  .. ఇక మరో వైపు హరిహర వీరమల్లు లు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ చేస్తున్నారు .. ఇలా మొత్తాని కి 2025 లో పవన్ నుంచి రెండు సినిమాలు పక్కాగా రాబోతున్నాయని క్లారిటీ వచ్చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: