వింటర్ లో డర్ నెస్ పెరిగిందా...? మీలో ఉత్సాహం నింపే ఫుడ్స్ ఇవే..!

lakhmi saranya
వింటర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా డల్ గా ఉంటారు. ఎందుకంటే వింటర్లో చలి ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర అనేది ఎక్కువగా వస్తుంది. చలికాలంలో వాతావరణ మార్పులు మానవ ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంటాయి. కూల్ బ్రదర్ కారణంగా ఉదయమనే లేవడానికి చాలామంది ఇష్టపడరు. దీంతో ఎండలో గడిపే అవకాశం ఉండదు. ఫలితంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. వ్యాయామాలకు కూడా కొందరు దూరంగా ఉండటం వల్ల బద్ధకం లేదా డల్ నెస్ పెరిగిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మూడ్ స్వింగ్స్ పెరిగిపోయి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి.
కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడంలో కొన్ని రకాల ఆహారాలు సహాయపడతాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్లో మీలో డల్ నెస్ పోయి ఉత్సాహంగా ఉండాలంటే తగిన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలు తీసుకోవటం ముఖ్యం. అయితే ఇది వాల్నట్స్, జీడిపప్పు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు వంటివి వాటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే సెరోటోనిన్ హార్మోన్ విడుదలను ప్రోత్సహిస్తాయి. ఫలితంగా డల్ నెస్ లేదా బద్ధకం వంటివి దూరం అవుతాయి.
ఫేవనాయిడ్స్ పాలీఫెనోల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి డార్క్ చాక్లెట్ కూడా అందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఫైబర్ కంటెంట్, విటమిన్ బి6 సహా ఈతరా విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు కలిగిన ఆహారాలు మీలో యాక్టివ్ నెస్ పెంచుతాయి. ప్రతి సీజన్లో అందుబాటులో ఉంటున్న అరటిపండులో ఇవి పుష్కలంగా లభిస్తాయి. అలాగే కొవ్వు చేపలు, ఓట్స్ లో బద్దకాన్ని దూరం చేసే పోషకాలు ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మీలో ఫీల్ గుడ్ హార్మోన్లు అయిన డోపమైన్, అలాగే సెరోటోనిన్ ఉత్పత్తి అవుతాయి. మీరు సంతోషంగా ఉండటంలో ఇది సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: